విశాఖపట్నం జిల్లాలోని Anandapuramలో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

పద్మనాభం మండలం కృష్ణాపురానికి చెందిన జగదీష్, రమేష్ ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇరువురి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనపై వెంటనే స్పందించిన భీమిలి ఎమ్మెల్యే Ganta Srinivasa Rao గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
