సజ్జనార్ కు అనసూయ ఫిర్యాదు

May 22, 2026 9:36 PM
Anasuya police Complaint

ప్రముఖ తెలుగు యాంకర్, నటి అనుసూయ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ కు తనకు ఎదురైన సమస్యను సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. తనను అసభ్యకరరీతిలో చూపిస్తూ ‘ఏఐ’ ఫొటోలను సృష్టిస్తున్నారని అనుసూయ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా వీసీ సజ్జనార్‌ను ట్యాగ్ చేశారు. ఒక ‘ఎక్స్’ హ్యాండిల్ తన ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను పోస్టు చేస్తోందని ఫిర్యాదులో తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండాలని తాను ప్రయత్నించానని, కానీ ఈ ‘ఎక్స్’ హ్యాండిల్ ద్వారా తరచూ తన ఫొటోలను పోస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనసూయ ఫిర్యాదుపై స్పందించిన సజ్జనార్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌‍ను సంప్రదించి ఫిర్యాదు చేయమని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media