K. Annamalaiను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడైన ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో, పార్టీ అధిష్టానం కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి దక్కే అవకాశం ఉంది. అదే స్థానాన్ని అన్నామలైకు కేటాయించే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ భాగస్వామ్యాల్లో టీడీపీకి రెండు సీట్లు, బీజేపీ, జనసేనలకు చెరో సీటు కేటాయించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉండగా, గతంలో కూడా అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, అప్పట్లో అవకాశం రాలేదు. అయితే ఈసారి మాత్రం పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. అలాగే టీడీపీ నుంచి పలువురు నేతలు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ అవకాశం దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
