కాకినాడ జిల్లాలోని Annavaram Templeలో దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా Geddam Bujji ప్రమాణ స్వీకారం చేశారు.

రత్నగిరిపై వెలసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన Pawan Kalyan మరియు ముఖ్యమంత్రి N Chandrababu Naiduకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ పదవిని ప్రజాసేవకు వేదికగా తీసుకుని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన లక్ష్యమని గెడ్డం బుజ్జి పేర్కొన్నారు.ఈ నియామకంతో పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాయి.
