AP:ఒంగోలు గనుల శాఖలో ఏసీబీ దాడులు: సర్వేయర్

February 9, 2026 1:26 PM

ఒక సాధారణ సర్వేయర్ సంపాదన చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. ఒంగోలు గనుల శాఖ (Mines & Geology) కార్యాలయంలో సర్వేయర్‌-2గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు శుక్రవారం (ఫిబ్రవరి 6, 2026) ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామచంద్రుడు ఆధ్వర్యంలో ఐదు బృందాలు విజయవాడ, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గుంటూరులో తనిఖీలు చేపట్టాయి.
22 ఎకరాల వ్యవసాయ భూమి, 2 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, ఒక ఇంటి స్థలం.620 గ్రాముల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి.రూ. 2.82 లక్షల నగదు, రూ. 15 లక్షల బీమా పత్రాలు.16 విలువైన చేతి గడియారాలు, రూ. 3.54 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు. 2013లో సర్వేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆసిఫ్, తక్కువ కాలంలోనే కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఆయనను ఒంగోలులో అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం విజయవాడకు తరలించారు.ప్రభుత్వ విధుల్లో ఉండి అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media