AP:వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం

January 29, 2026 1:49 PM

కోనసీమ ముఖద్వారమైన అంతర్వేది క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ వేడుక, గురువారం తెల్లవారుజాము వరకు అత్యంత ఆధ్యాత్మిక శోభతో కొనసాగింది.

రోహిణీ నక్షత్ర యుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో.. గురువారం తెల్లవారుజామున ఒంటిగంట 56 నిమిషాలకు (1:56 AM) స్వామివారు ఉభయ దేవేరులను పరిణయమాడారు.
రథసప్తమి నాడు స్వామివారిని పెళ్లికుమారుడిగా అలంకరించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో కోట్లాది మంది దేవతలను ఆవాహనం చేస్తూ ఈ క్రతువును నిర్వహించారు. సాక్షాత్తు ఆ నృసింహ స్వామి కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అంతర్వేదికి తరలివచ్చారు. స్వామివారి నామస్మరణతో సాగర తీరం మారుమోగింది. దేవదేవుడి కళ్యాణ ఘట్టం భూలోకంలోనే ఒక అద్భుత ఘట్టమని అర్చకులు అభివర్ణించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media