AP సచివాలయ CSO మల్లికార్జునరావుకు ‘ఇండియన్ పోలీస్ మెడల్’

January 27, 2026 5:05 PM

ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముఖ్య భద్రతాధికారి (CSO), ఏపీఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పోలవరపు వెంకట శేష నాగ మల్లికార్జునరావును భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఇండియన్ పోలీస్ మెడల్) తో గౌరవించింది. 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది.

1989లో ఐటీబీపీ (ITBP)లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లికార్జునరావు, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్‌లలో విధులు నిర్వర్తించారు. 1993 నుంచి ఏపీ ప్రత్యేక రక్షణ దళం (APSPF)లో చేరి కీలక బాధ్యతలు చేపట్టారు. తిరుమల టీటీడీ, ఏపీ హైకోర్టు, విజయవాడ విమానాశ్రయం, ఓఎన్‌జీసీ రాజమండ్రి వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా పర్యవేక్షణలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఏపీ సచివాలయ సీఎస్ఓగా తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తన 36 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఆయన ఇప్పటివరకు 27 క్యాష్ రివార్డులు, 17 గుడ్ సర్వీస్ ఎంట్రీలు, 2006లో ఏపీ పోలీస్ సేవా పథకం మరియు 2013లో ఏపీ ఉత్తమ సేవా పథకం వంటి అనేక గౌరవాలను అందుకున్నారు.ఈ ప్రతిష్టాత్మక పతకం దక్కడం పట్ల ఏపీఎస్పీఎఫ్ డిజి, ఐజి మరియు సచివాలయ సిబ్బంది ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media