AP:కళింగపట్నంలో CISF ‘వందేమాతరం’ Cyclothon2026

February 7, 2026 12:36 PM

దేశ భద్రతలో సముద్ర తీరాల రక్షణ అత్యంత కీలకమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకరరావు పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వందేమాతరం కోస్టల్ సైక్లథాన్-2026’ బృందం గురువారం కళింగపట్నం చేరుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

6,553 కిలోమీటర్ల మేర సాగుతున్న ఈ యాత్రలో 130 మంది జవాన్లు పాల్గొంటున్నారు. ఇందులో సగం మంది (65 మంది) మహిళా సిబ్బంది ఉండటం విశేషం. యువతకు శుభవార్త చెబుతూ.. ఈ ఏడాది సీఐఎస్‌ఎఫ్‌లో మరో 15,000 ఖాళీల భర్తీ జరగనుందని కమాండెంట్ జితేంద్రబాబు వెల్లడించారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన ఈ యాత్ర 9 రాష్ట్రాల మీదుగా 52 తీర ప్రాంత గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ఈ నెల 22న కేరళలోని కొచ్చిలో ముగియనుంది. బుద్ధా స్కూల్ వద్ద నిర్వహించిన సాక్సోఫోన్ ప్రదర్శన, కోలాటం, నృత్యాలు పర్యాటకులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తీర ప్రాంత ప్రజలు దేశభక్తితో భద్రతా దళాలకు సహకరించాలని, ఓడరేవుల రక్షణలో భాగస్వాములు కావాలని అధికారులు ఆకాంక్షించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media