స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సును ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి చేరుకున్నారు.ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన.. అమరావతికి చేరుకున్న సీఎం. గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం. రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సాగిన మెగా పర్యటన. దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ.. ఏపీకి భారీగా పెట్టుబడుల వెల్లువ!
గన్నవరం విమానాశ్రయంలో సీఎంకు సీఎస్ విజయానంద్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 36కు పైగా కీలక సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు, రాష్ట్రానికి సుమారు రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడి కట్టుబాట్లను సాధించారు. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే లక్ష్యంతో సాగిన ఈ పర్యటన విజయవంతం కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
.
