AP:రాపూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అవినీతిపై విచారణ

February 12, 2026 11:44 AM

రాపూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) లో గతంలో పనిచేసిన డాక్టర్ బి. చంద్రశేఖర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. 2017 నుండి 2019 మధ్య కాలంలో ఆయన హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై తీవ్రమైన అభియోగాలు రావడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

పారదర్శకత కోసం ప్రభుత్వం తిరుపతి, ప్రకాశం జిల్లాలకు చెందిన వైద్య అధికారులను విచారణాధికారులుగా నియమించింది. విచారణాధికారులు టి. వెంకటేశ్వర్లు, వి. బాలకృష్ణ నాయక్ నేతృత్వంలోని బృందం గురువారం రాపూరు ఆసుపత్రిని సందర్శించింది. 2017-19 కాలానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు, నిధుల వినియోగం మరియు ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డుల పరిశీలన అనంతరం పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, ఆ నివేదిక ఆధారంగా డాక్టర్ చంద్రశేఖర్‌పై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ అవినీతి వ్యవహారం ఇప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media