ఆంధ్రప్రదేశ్‌లోని Mangalagiriలో ఈగల్ (EAGLE) ప్రధాన కార్యాలయాన్ని DGP Harish Kumar Gupta ప్రారంభించారు. డ్రగ్ ఫ్రీ సమాజం లక్ష్యంగా ఈ యూనిట్‌ను ప్రీమియర్ సంస్థగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం ఈగల్ ప్రధాన లక్ష్యమని, డ్రోన్స్, సాటిలైట్స్ సహాయంతో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 112 ఎన్డీపీఎస్ కేసులు నమోదు కాగా, వాటిని 200కి పెంచే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయి.డ్రగ్ గ్యాంగ్స్ ఆర్థిక వనరులపై దాడులు, వినియోగదారులపై ప్రత్యేక దృష్టి, డార్క్ వెబ్ లావాదేవీలపై నిఘా వంటి చర్యలు చేపడుతున్నారు. విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభమై, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రణాళిక ఉందని తెలిపారు.డ్రగ్స్ టెర్రరిజం లాంటి ప్రమాదమని హెచ్చరిస్తూ, ఇంటర్ స్టేట్ నెట్వర్క్‌లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు.
