AP:అరసవల్లి రథసప్తమి ఏర్పాట్లపై హోం మంత్రి అనిత సమీక్ష!

January 22, 2026 11:38 AM

భక్తుల భద్రతే ముఖ్యం అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతిభద్రతలపై రివ్యూ.అరసవల్లి రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.

భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ.. క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని శ్రీకాకుళంలో స్పష్టం చేశారు.ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అరసవల్లి క్షేత్రంలో జరిగే రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రానున్న ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media