కర్నూలు నగరంలోని అశోక్ నగర్లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. డ్రైనేజీ పనుల నిర్లక్ష్యం కారణంగా ఒక భారీ విద్యుత్ స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ భీకర దృశ్యాలు స్థానిక CC కెమెరాలో రికార్డవ్వగా, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఉదయం పూట ఒక విద్యార్థి స్కూలుకు వెళ్తుండగా విద్యుత్ స్తంభం అతనిపైకి కూలబోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో, ఆ బాలుడు అప్రమత్తమై వెనక్కి తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన డ్రైనేజీ కాలువ మరమ్మతులే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాలువ తవ్వకాల్లో స్తంభం పునాది బలహీనపడటంతో అది ఒక్కసారిగా విరిగిపడింది. విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ అధికారుల మధ్య కనీస సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ CCTV విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలం నుండి మరిన్ని వివరాలను మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు.
