AP:”భక్తుల సేవయే మహాద్భాగ్యం” TTD EO ముద్దాడ రవిచంద్ర

February 7, 2026 12:23 PM

తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ, ముందుగా భూవరాహ స్వామిని దర్శించుకున్న ముద్దాడ రవిచంద్ర, అనంతరం శ్రీవారి ఆలయంలో ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ప్రథమ లక్ష్యమని రవిచంద్ర తెలిపారు. ముఖ్యంగా లడ్డూ నాణ్యత, దర్శన సౌలభ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.

TTD బోర్డు, అనుభవజ్ఞులైన అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తానని హామీ ఇచ్చారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ, భక్తుల మనోభావాలకు అనుగుణంగా పారదర్శకమైన నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media