రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆత్మకూరులో పునర్నిర్మించిన ‘లూథరన్ క్రీస్తు కరుణాలయం’ను ప్రారంభించారు. చర్చి ప్రారంభోత్సవ ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఆత్మకూరులోని పురాతన లూథరన్ చర్చిని అధునాతన సౌకర్యాలతో పునర్నిర్మించారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం స్థానిక క్రైస్తవ సోదరులకు ఎంతో కీలకం.అందరూ సోదరభావంతో మెలగాలని, దైవచింతనతోనే ప్రశాంతమైన సమాజం సాధ్యమని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పేర్కొన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు మరియు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
