APలో పెట్రోల్ బంకులు ఖాళీ: కర్నూలులో 66 బంకులు మూత

April 25, 2026 4:32 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంధన కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా Kurnool జిల్లాలో పరిస్థితి మరింత విషమంగా మారింది. జిల్లాలో ఉన్న 166 పెట్రోల్ బంకుల్లో 66కిపైగా బంకులు పూర్తిగా మూతపడ్డాయి.

ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరాలో కోతలు విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సరఫరా తగ్గిపోవడంతో మిగతా బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది.స్టాక్ లేకపోవడంతో ఒక బంక్ నుంచి మరో బంక్‌కు పరుగులు తీస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక బకాయిలు చెల్లించకపోతే సరఫరా చేయబోమని ఆయిల్ కంపెనీలు చెబుతున్నట్లు సమాచారం.ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media