AP రీసర్వే ప్రాజెక్టు విజయవంతం చేయాలి రైతులతో అవగాహన

April 17, 2026 10:06 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రాజెక్టును విజయవంతం చేయాలని మండల రెవెన్యూ అధికారులు రైతులను కోరారు.

నందిగాం మండలంలోని పెద్దబాణాపురం, తురకలకోట, బోరుభద్ర గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న భూ సంబంధిత సమస్యలను సర్వే అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.గ్రామ కంఠాలు, చెరువులు, పోరంబోకు భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని అధికారులు తెలిపారు. రైతులు తమ వద్ద ఉన్న భూహక్కు పత్రాలు, 1B రికార్డులు, పాస్‌బుక్స్ తీసుకుని పొలాల వద్ద సర్వే అధికారులకు చూపించాలని సూచించారు.ఇంకా నాలుగు రోజుల్లో గ్రామాల్లో విస్తృత సర్వేలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media