Mumbaiలో నిర్వహించిన 24వ Indian Association of Amusement Parks and Industries (IAAPI) ఎక్స్‌పోలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి Kandula Durgesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆయన ఆహ్వానించారు.

రాష్ట్రంలో అమ్యూజ్‌మెంట్ పార్కులు, థీమ్ పార్కులు, వాటర్ ఫ్రంట్ అట్రాక్షన్స్, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. నూతన పర్యాటక పాలసీ 2024–29 ద్వారా పెట్టుబడిదారులకు అనేక రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు.

Amaravati, Visakhapatnam, Tirupati నగరాల్లో భారీ అమ్యూజ్‌మెంట్ పార్కుల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆహ్వానించారు. గత ఏడాదిలోనే 102 ఒప్పందాల ద్వారా రూ.18,448 కోట్ల పర్యాటక పెట్టుబడులను ఆకర్షించామని మంత్రి వెల్లడించారు.CM N. Chandrababu Naidu, డిప్యూటీ సీఎం Pawan Kalyan దార్శనికతతో ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’ రూపొందించామని తెలిపారు. ఏపీ పర్యాటక రంగం కొత్త శకంలోకి ప్రవేశిస్తోందని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
