వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. దుర్గమ్మ తల్లి నేడు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

మహామండపంలో ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేలాది మంది చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సుమారు 25,000 మంది విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ సీనా నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, కంకణాలు, కుంకుమ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ అధికారులు మరియు పాలకమండలి భక్తుల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
