ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. ఏరియేటర్లు నిలిచిపోతే చెరువుల్లో ఆక్సిజన్ లేక రొయ్యపిల్లలు చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్పు చేసి తెచ్చిన రొయ్యపిల్లలను కాపాడుకోవడానికి డీజల్ అత్యవసరమని, కేవలం ₹500కి డీజల్ ఇవ్వాలని కొందరు రైతులు వేడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డీజల్ కొరత కారణంగా ఏరియేటర్లు ఆగిపోతే మొత్తం పంట నాశనం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణం స్పందించి డీజల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
