AP:Avanthi కళాశాలలో సంక్రాంతి సందడి part-1

January 15, 2026 11:00 AM

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి శోభ అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో అంబరాన్నంటింది. మాజీ మంత్రి, విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శనివారం కళాశాల ప్రాంగణంలో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా వేడుకలు నిర్వహించారు.

ప్రముఖ కవి బులుసు వెంకటేశ్వర్లు సంక్రాంతి విశిష్టతను వివరించగా, ‘పల్సర్ బైక్’ రమణ తన పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు.

కోలాటం, దాండియా నృత్యాలు మరియు గాలిపటాల పోటీలతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే గృహ సముదాయాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులలో సాంప్రదాయ విలువలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రతీ ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని ఎండీ ముత్తంశెట్టి ప్రియాంక తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media