రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడించిన సంచలన గణాంకాలు
Banks మన జేబులకు ఇంత పెద్ద బొక్క పెడుతున్నాయా? … సామాన్యుడు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించిన పైసల్ని మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో బ్యాంకులు సైలెంట్ గా లాగేస్తున్నాయి. బ్యాంకు ఖాతాలో నిర్దేశిత కనీస సొమ్మును మెయింటెన్ చేయలేకపోయారనే ఒక్క సాకుతో, గత నాలుగేళ్ల కాలంలో మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిసి వినియోగదారుల నుంచి అక్షరాలా రూ.26,170.37 కోట్లు పెనాల్టీల రూపంలో గుంజేశాయంటే నమ్ముతారా. …
Yes, you read that right… మన డబ్బులకే మనం సెక్యూరిటీ అడిగితే, మినిమమ్ బ్యాలెన్స్ లేదనే నెపంతో రివర్స్‌లో మన కష్టార్జితానికే ఎసరు పెడుతున్నాయి. ఇటీవలే రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన ఆన్సర్‌తో ఈ మైండ్ బ్లోయింగ్ నిజాలు బయటపడి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.
ఎస్‌బీఐ ఒక్క ఏడాదిలోనే రూ.477.27 కోట్ల పెనాల్టీలు:
సర్వీస్ లీడర్లుగా బిల్డప్ ఇచ్చే ప్రైవేట్ Banks దే ఈ దోపిడీలో ఫస్ట్ ప్లేస్. ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏకంగా రూ.4,948.71 కోట్లు ఖాతాదారుల నుంచి రాబట్టగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.2,137.92 కోట్లు వసూలు చేశాయి. అంటే గవర్నమెంట్ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు సామాన్యుల జేబులకు డబుల్ రేంజ్‌లో చిల్లు పెట్టేశాయన్నమాట.
ఇక దేశంలోనే అత్యంత నమ్మకమైన బ్యాంక్ అని మనం మురిసిపోయే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ బాదుడులో ఏమాత్రం తక్కువ తినలేదు. ఒక్క 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ లేని పేద, దిగువ మధ్యతరగతి ఖాతాదారుల నుంచి రూ.477.27 కోట్ల జరిమానా వసూలు చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు:
పట్టణాలు, పల్లెల్లో రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే కుర్రాళ్ళు, నిరుపేదలు అసలే తిండికి, రూమ్ రెంట్లకు తిప్పలు పడుతుంటే… అకౌంట్‌లో నాలుగైదు వందలు తగ్గగానే బ్యాంకులు కనికరం లేకుండా పెనాల్టీల పేరుతో దొంగతనం చేసినట్లు కట్ చేసేస్తున్నాయి.
అకౌంట్ తెరిచేటప్పుడే రూల్స్ చెప్పాం కదా … అని బ్యాంకింగ్ ఆఫీసర్లు లాజిక్కులు మాట్లాడుతున్నారు. కానీ, అసలు ఆ నిబంధనలే సామాన్యుడి పొట్ట కొడుతున్నాయని గుర్తించట్లేదు. సేవల నిర్వహణకు ఈ ఛార్జీలు అవసరమని బ్యాంకులు కవర్ చేసుకుంటున్నా, ఇది పక్కా లీగల్ దోపిడీయే అని ఆర్థిక నిపుణులు భగ్గుమంటున్నారు.
ఇప్పటికైనా మనం మేల్కొని, అనవసర ప్రైవేట్ అకౌంట్లను క్లోజ్ చేసి, కనీస నిల్వ గొడవ లేని జీరో బ్యాలెన్స్ అకౌంట్ల వైపు మారాలి. లేదంటే మన కష్టమంతా బ్యాంకులో ఉన్న ఛార్జీలే తినేస్తాయి. అలాగే ప్రభుత్వం, ఆర్బీఐ తక్షణమే జోక్యం చేసుకుని ఈ పెనాల్టీ దందాకి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే సామాన్యుడి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం.



