బాపట్ల జిల్లాలో అవినీతి అధికారిపై ఏసీబీ (ACB) దాడి చేసి పట్టుకున్న ఘటన సంచలనం రేపింది. బాపట్ల నగరపాలక సంస్థలో ఆర్ఐగా పనిచేస్తున్న షేక్ ఇమామ్ ₹60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
సూర్యలంక రహదారి ముత్తయ్యపాలెం టీ హౌస్ వద్ద లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఆపరేషన్‌ను ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ నేతృత్వంలో నలుగురు సీఐల బృందం నిర్వహించింది. అనంతరం నిందితుడిని బాపట్ల మున్సిపల్ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.ఈ ఘటనతో స్థానికంగా చర్చలు మొదలయ్యాయి. అవినీతిపై ఏసీబీ కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
