Bengaluruలో రోడ్ల దుస్థితిపై ఓ వ్యాపారి స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరుకు చెందిన ఎంట్రప్రెన్యూర్ Akhil Hemadri గుంతలమయమైన రోడ్లతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎన్ని రోజులు గడిచినా ప్రభుత్వం గుంతలను పూడ్చి వేయకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగాడు.

తన ఖరీదైన Porshe కారులో సిమెంట్, ఇసుక, బిస్లరీ బాటిల్స్ లో నీళ్లు తీసుకొచ్చిన Akhil Hemadri కారు బాయ్నెట్ పైనే వాటిని కలిపి గుంతలను పూడ్చివేసే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన అక్కడున్న వారిని ఆశ్యర్యానికి గురి చేయగా..ఈ అసాధారణ సంఘటనకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. కొందరు ఆయన చర్యను ప్రశంసిస్తుండగా, మరికొందరు భద్రతా ప్రమాణాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోతో పాటు అఖిల్ హెమాద్రి ఒక సందేశాన్ని కూడా షేర్ చేశారు.భారతదేశం వంటి అత్యధిక జనాభా గల దేశంలో ప్రజలు కూడా పబ్లిక్ స్పేస్‌ల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం ఒక్కదానితోనే అన్నీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
