అపూర్వ Vs త్రిగుణ్.. ఇద్దరూ ఇద్దరే! నామినేషన్స్‌లో రచ్చ.. మధ్యలో వర్షిణి, ముఖేష్

October 5, 2026 12:58 PM
Apoorva and Thrigun argue during Bigg Boss 10 Telugu nominations.

బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ హీట్

Bigg Boss 10 Teluguలో ఐదో వారం నామినేషన్స్ రచ్చ మొదలైంది. Day 29 Promo 1లో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం కనిపించింది. ముఖ్యంగా అపూర్వ, త్రిగుణ్ మధ్య వాదన హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవలో వర్షిణి, ముఖేష్ కూడా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కినట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే కెప్టెన్సీ విషయంలో అపూర్వపై నాగ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆమెను డిజాస్ట్రస్ కెప్టెన్ అంటూ విమర్శించారు. గేమ్ సమయంలో అపూర్వ రెడ్ టీంకే ఎక్కువగా ఫేవర్‌గా వ్యవహరించిందనే విమర్శలు వచ్చాయి. తాను ఉన్న టీం గురించి ఎక్కువగా ఆలోచించిందని, ఇంటి కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన బాధ్యతను గుర్తించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

‘రోడ్ టు రీలోడ్’ థీమ్‌తో నామినేషన్స్

బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం ‘రోడ్ టు రీలోడ్’ థీమ్ కనిపించనుంది. ఈసారి నామినేషన్ ప్రక్రియ కూడా కొత్త స్టైల్లో సాగుతున్నట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

కొన్ని బాక్సులను ఏర్పాటు చేశారు. వాటిలో ఒక పండును దాచారు. కంటెస్టెంట్లు వెళ్లి ఆ పండు ఏ బాక్స్ కింద ఉందో గుర్తించాలి. ఆ పండును కనిపెట్టిన కంటెస్టెంట్‌కు నామినేషన్ చేసే అవకాశం లభిస్తున్నట్టు కనిపిస్తోంది.

మొదట రాం ప్రసాద్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నాడు. అమన్ చాలా ఫిజికల్‌గా అవుతున్నాడనే కారణంతో అతడిని నామినేట్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది.

అమన్ Vs త్రిగుణ్.. ఫిజికల్ గేమ్‌పై గొడవ

అమన్, త్రిగుణ్ మధ్య కూడా వాదన మొదలైంది. “ఆయన స్టార్ట్ చేస్తే నేను ఎండ్ చేశా” అన్నట్టుగా అమన్ మాట్లాడాడు. తాను మామూలుగానే పట్టుకున్నానని, అది త్రిగుణ్ వల్లే అలా జరిగిందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరోవైపు త్రిగుణ్ తనను ఫిజికల్‌గా టార్గెట్ చేశారని అన్నాడు. “ప్రాణం పోయేటప్పుడు కూడా సంచాలక్ కోసం వెయిట్ చేయడం ఎలా?” అంటూ ప్రశ్నించాడు.

దీనిపై అపూర్వ స్పందించింది. ఇద్దరు సంచాలక్‌లు ఉన్నారని చెప్పింది. మరి వాళ్లను ఎందుకు అనడం లేదని అపూర్వ ప్రశ్నించింది. దీంతో అక్కడ మరోసారి మాటల యుద్ధం మొదలైంది.

రోహిత్ కామెంట్స్‌తో మరో వివాదం

ఈ గొడవలో రోహిత్ చేసిన కామెంట్స్ కూడా చర్చకు వచ్చాయి. “ఇది పొరబాటు కాదు.. ఇది అలవాటు” అంటూ రోహిత్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

దీనిపై వంశీ స్పందించాడు. “మాటకి ముందు.. ఇవ్వాల చూస్తారు నేను ఏంటో.. ఆడియెన్స్‌కి తెలుస్తుంది నేను ఏంటో” అంటూ ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించాడు.

తాను అలా అనలేదని రోహిత్ చెప్పాడు. అయితే త్రిగుణ్ పేరు చెప్పి అన్నావని వంశీ చెప్పాడు. దీనిపై రోహిత్ లేదు లేదు అంటూ సమాధానం ఇచ్చాడు.

త్రిగుణ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. తనను టార్గెట్ చేశారని, “చెక్క భజన” అని చెప్పినప్పుడు కూడా ఇదే విషయమని అన్నాడు. అయితే తాను ఎవ్వరినీ “చెక్క భజన” అని అనలేదని రోహిత్ స్పష్టం చేశాడు.

అపూర్వ కెప్టెన్సీపై ముఖేష్, వర్షిణి ఫైర్

ముఖేష్ కూడా అపూర్వ కెప్టెన్సీపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. తనకు అధికారం వచ్చిందని “అది చేయ్.. ఇది చేయ్” అని చెప్పినట్టుగా అనిపించిందని ముఖేష్ అన్నాడు.

దీనికి అపూర్వ కూడా కౌంటర్ ఇచ్చింది. తన దగ్గర కెప్టెన్ బ్యాడ్జ్ ఉంటే ఇంటిని నడిపించేది నువ్వేనని తనకు అనిపిస్తోందని ముఖేష్, వర్షిణిలను కలిపి చెప్పింది.

దీంతో వర్షిణి ఒక్కసారిగా అపూర్వ దగ్గరకు వచ్చింది. “మళ్లీ చెప్పు” అంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత వర్షిణి తీవ్రంగా స్పందించింది. అపూర్వను “వరెస్ట్ కెప్టెన్”, “డిజాస్ట్రస్ కెప్టెన్” అంటూ అరిచింది.

త్రిగుణ్ Vs అపూర్వ.. మాటల యుద్ధం

ఇక త్రిగుణ్, అపూర్వ మధ్య కూడా మాటల యుద్ధం తీవ్రంగా సాగింది. “బటర్‌ఫ్లై అని అన్నారు.. కానీ చెవిలో మోతలా అనిపిస్తుంది” అంటూ త్రిగుణ్ వ్యాఖ్యానించాడు.

రోహిత్‌ను అనడానికి అపూర్వ కీలకమైన అబద్ధం చెప్పిందని త్రిగుణ్ ఆరోపించాడు.

దీనికి అపూర్వ కూడా గట్టిగానే స్పందించింది. పక్కనోళ్లను “థూ” అని అనే నువ్వు, బూతులు మాట్లాడే నువ్వు అంటూ త్రిగుణ్‌పై ఫైర్ అయింది.

త్రిగుణ్ కూడా వెనక్కి తగ్గలేదు. “నీ గురించి రోహిత్ చెప్పింది కరెక్ట్” అంటూ అపూర్వను ఉద్దేశించి మాట్లాడాడు. అసలు తాను రావాలని ఎందుకు కోరుకున్నానా అని ప్రతిరోజూ అనుకుంటున్నానని త్రిగుణ్ అన్నాడు.

నామినేషన్స్‌లో అసలు రచ్చ మొదలైందా?

బిగ్ బాస్ 10 తెలుగు ఐదో వారం నామినేషన్స్‌ ప్రోమోలో కనిపించిన సన్నివేశాలు చూస్తే ఇంట్లో వాతావరణం వేడెక్కినట్టు తెలుస్తోంది. అమన్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ గేమ్‌పై వివాదం మొదలైంది. ఆ తర్వాత రోహిత్ కామెంట్స్, అపూర్వ కెప్టెన్సీ, వర్షిణి ఆగ్రహం, త్రిగుణ్‌తో అపూర్వ వాగ్వాదం వరకు నామినేషన్స్ ప్రక్రియ మరింత హీట్ పెంచినట్టు కనిపిస్తోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media