మున్సిపల్ కార్యాలయం ముందు BJP కౌన్సిలర్ల ఆందోళన

March 11, 2026 1:10 PM

Kamareddy మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. వార్డుల్లో శానిటేషన్ లేబర్లు పనిచేయడం లేదని ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ప్రశ్నించారు.

వార్డుల్లో సమస్యల పరిష్కారం కోసం కమిషనర్‌ను కలిసినా సరైన సమాధానం ఇవ్వలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో శానిటేషన్ సిబ్బంది ఉన్నప్పటికీ వారు ఫీల్డ్‌లో కనిపించడం లేదని ఆరోపించారు.వీధి దీపాలు, చెత్త సేకరణ, ఫాగింగ్, తాగునీటి సమస్యలపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media