ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి ‘జనతా వారధి’: MLA రాజు

February 7, 2026 4:41 PM

BJP రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ‘జనతా వారధి’ కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రత్యేక చొరవ చూపుతోంది. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎం.ఎం.ఎన్ పరశురామ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు, లంక దినకర్ పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.
జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ దీర్ఘకాలిక సమస్యలపై అర్జీలు ఇవ్వవచ్చని విష్ణుకుమార్ రాజు తెలిపారు.

స్వీకరించిన అర్జీలను త్వరితగతిన సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారమయ్యేలా ఒత్తిడి తీసుకువస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని, ప్రజల పక్షాన నిలబడటమే బీజేపీ లక్ష్యమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనతా వారధి రాష్ట్ర ఇంచార్జ్ రెడ్డి పావని, రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, అధికార ప్రతినిధి డా. సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media