తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు మండిపడ్డారు. కామారెడ్డిలో జరిగిన పరిణామాలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే రమణారెడ్డిని పరామర్శించడానికి వెళ్తుంటే బీజేపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి, బాన్సువాడ మరియు రుద్రారం ఘటనల వెనుక మజ్లిస్ పార్టీ హస్తం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైసీలకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు.బాన్సువాడ ఘటనలో హిందువులపైనే కేసులు పెట్టడం అన్యాయమని, దేవాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ హయాంలో అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో హామీలు అమలు చేయకుండా, కేవలం నిధుల వసూళ్ల కోసమే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చారని రామచందర్ రావు ఎద్దేవా చేశారు.ఇరాన్ దేశం అనుసరిస్తున్న ప్రస్తుత చర్యలు సరైనవి కావని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని, ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
