ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. 13 మంది బస్సు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరికొందరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రైవేటు బస్సు తీవ్రమైన వేగంతో ప్రయాణిస్తూ, ఆగి ఉన్న టిప్పర్ లారీ ని ఢీ కొట్టింది. నిముషాల వ్యవధిలోనే బస్సులో మంటలు చోటు చేసుకొన్నాయి. ముందు సీట్లలోని ప్రయాణికులు వేగంగా ముందు ఉన్న డోర్ ద్వారా బస్సు దిగేసి, ప్రాణాలు దక్కించుకొన్నారు. కానీ వెనుక భాగంలో స్లీపర్ సీట్స్ లో ఉన్న ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం మీద గవర్నర్ అబ్దుల్ నజీజ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, సీనియర్ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
