కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్, మాజీ మంత్రి రోజా, వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి, టాలీవుడ్ హీరో శర్వానంద్ మరియు హీరోయిన్ సాక్షి వైద్య స్వామివారి సేవలో పాల్గొన్నారు.

ఆలయ అధికారులు ప్రముఖులకు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందజేశారు.
ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ, ప్రముఖుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. తమ అభిమాన నటులను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.
