నగరంలోని Chandanagar ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్‌లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో మంటలు భారీగా ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
