టిడిపిలో ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే.

April 11, 2026 5:36 PM

అమరావతి BNS ఏప్రియల్ 11: టిడిపి పార్టీలో ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో పాల్గొని ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడారు. సీనియర్ నేతలతో నేతలకు, కార్యకర్తలకు శిక్షణ, క్రమశిక్షణ జరుగుతున్న అంశాలపై కార్యకర్తలతో కాఫీ తాగుతూ తన అభిప్రాయాలను చంద్రబాబు పంచుకున్నారు.
రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను కార్యకర్తలకు చంద్రబాబు వివరించారు.

క్షేత్రస్థాయిలో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపైనా నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
సమాజంలో జరిగిన,జరుగుతున్న పరిణామాలను… ప్రత్యర్ధి పార్టీ దుర్మార్గాలను సామాన్య కార్యకర్తలైనా మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం అమలు చేస్తామని, క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టాం… క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాం… క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నాం. క్లీన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీని నిలిపేలా కార్యకర్తలు పని చేయాలి. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి… పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలి… గతానికంటే టీడీపీ ఓట్ బ్యాంక్ పెరిగేలా కార్యకర్తలు నాయకులు ప్రజల్లో మార్పు తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు.

నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ కార్యక్రమం చేపడుతానని,నా కుటుంబం కోసం ఏ విధంగా ఆలోచన చేశానో... టీడీపీ కుటుంబం కోసం అదే విధంగా ఆలోచన చేస్తానని చంద్రబాబు నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని చంద్రబాబుకు పలు సూచనలు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media