పద్మ పురస్కారాల తెలుగు విజేతలకు CM చంద్రబాబు ప్రశంసలు

January 27, 2026 2:57 PM

దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ఏకంగా 13 మంది తెలుగు ప్రముఖులకు ప్రతిష్టాత్మక అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ రావడంపై సీఎం ప్రత్యేకంగా అభినందించారు. యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్, ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) సహా ఇతర ప్రముఖులకు పద్మశ్రీ దక్కడం తెలుగు జాతికి గర్వకారణమని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ఈ మహనీయుల కృషి భావితరాలకు స్ఫూర్తినిస్తుందని, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారని సీఎం కొనియాడారు.

అవార్డు గ్రహీతల జాబితా:
నోరి దత్తాత్రేయుడు, మామిడాల జగదీశ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, కె. బాల సుబ్రహ్మణియన్, విజయ్ ఆనంద్ రెడ్డి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి, వెంపటి కుటుంబ శాస్త్రి, గూడూరు వెంకట్రావు, దీపికారెడ్డి, జి. చంద్రమౌళి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media