నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలోని వేములపాడు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. యాదిలో ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. నీటి వినియోగం సంరక్షణ, వివిధ నేటియజమాన్య విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించి దిశా నిర్దేశం చేస్తారు. వేమలపాడు వద్ద పెండేకల్లు రిజర్వాయర్ ను పరిశీలించి, జలధార కార్యక్రమంలో పాల్గొంటారు. సాగునీటి సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్, ప్రతి నీటి బొట్టును ఎలా వడిసి పట్టుకోవాలి, సాగునీటి సంఘాలు సభ్యుల బాధ్యత ప్రజల బాధ్యతలపై చంద్రబాబు నాయుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు. ఇలా ప్రధానంగా నీటి సంరక్షణ పై సీఎం చంద్రబాబు ప్రధాన అంశంగా ఈ పర్యటన సాగుతోంది. అనంతరం వేమలపాడు వద్ద పార్టీ క్యాడర్ తో సమావేశం నిర్వహిస్తారు. వారికి దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం హెలికాప్టర్ లో ఉండవల్లి కి తిరిగి ప్రయాణం అవుతారు.
