చార్ ధామ్ యాత్రలో “Panchagavya” వివాదాస్పద నిబంధన.. ‘

April 22, 2026 4:09 PM

ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర అక్షయ తృతీయ సందర్భంగా ఘనంగా ప్రారంభమైంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు వేద మంత్రాల మధ్య తెరుచుకున్నాయి. అయితే ఈసారి యాత్రలో ఒక వివాదాస్పద నిబంధన చర్చనీయాంశమైంది.

గంగోత్రి ఆలయ కమిటీ నిర్ణయం ప్రకారం, హిందువేతరులకు నేరుగా ప్రవేశం ఇవ్వకుండా, పంచగవ్య సేవనం తప్పనిసరి చేసినట్లు సమాచారం. పంచగవ్య అంటే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం మరియు గంగాజలంతో కూడిన మిశ్రమం. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఇది సనాతన ధర్మ సంప్రదాయం భాగమని కమిటీ వివరణ ఇచ్చింది.ఇక బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కూడా హిందువేతరుల ప్రవేశంపై నిషేధ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అయితే యమునోత్రి ఆలయ కమిటీ మాత్రం ‘అతిథి దేవో భవ’ సిద్ధాంతంతో అన్ని మతాల భక్తులకు స్వాగతం పలుకుతోంది.ఈ నిబంధనపై సంప్రదాయం పేరుతో తీసుకున్న నిర్ణయమా? లేక వివక్షా? అనే చర్చలు కొనసాగుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media