CM పీషీ పేరుతో భారీ మోసం.. ఉద్యోగాల ఆశ చూపి లక్షల వసూలు!

January 23, 2026 3:51 PM

ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో అమాయకులకు ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న అంతర్ జిల్లా ముఠా గుట్టును అనకాపల్లి జిల్లా పోలీసులు రట్టు చేశారు. SP తుహిన్ సిన్హా పర్యవేక్షణలో రోలుగుంట పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నట్లు నకిలీ ఆడియోలు సృష్టించి, మంత్రి లోకేష్ పీఏగా నటిస్తూ బాధితులను నిందితులు నమ్మించారు.
DSCలో ఎస్జీటీ పోస్టు ఇప్పిస్తామని నమ్మిస్తూ ఒకే కుటుంబం నుండి రూ. 12.13 లక్షలు కాజేశారు. ప్రధాన నిందితుడు ఎరగోర్ల శ్రీను, అతడికి సహకరించిన షేక్ సలీంను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఉద్యోగాలు కేవలం మెరిట్ ప్రాతిపదికనే వస్తాయని, ఇలాంటి మోసగాళ్లను నమ్మవద్దని SPప్రజలను హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media