సీఎన్జీపై మరో భారం, కిలోపై రూ.2 పెంపు

May 26, 2026 11:13 AM

హైదరాబాద్: చమురు సంస్థలు సీఎన్జీ ధరలను మరోసారి పెంచాయి. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలను నాలుగు సార్లు పెంచిన సంస్థలు తాజాగా సీఎన్జీ రేట్లను కూడా సవరించాయి. కిలో సీఎన్జీపై రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

పదకొండు రోజుల్లో ఇది నాలుగోసారి సీఎన్జీ ధర పెంపు కావడం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.83కు చేరింది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో చమురు సంస్థలు పెట్రో ఉత్పత్తుల ధరలను వరుసగా పెంచుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media