ఢిల్లీలో ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ ఆందోళన

June 1, 2026 8:24 PM
cockroach-janata-party-delhi-protest

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనలు చేపట్టడానికి తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. జూన్ 6 శనివారం ఉదయం తాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్నట్లు వెల్లడించారు. పరీక్షల లోపాల వల్ల తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులు, తమ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా మన గొంతు వినిపించాల్సిన సమయం వచ్చిందన్నారు. మేమంతా ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలు చేపట్టడానికి అనుమతి కోరతామని దీప్కే వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media