రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై డీజీపీ శివధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘Arrive Alive’ అంటే క్షేమంగా వెళ్లి ప్రాణాలతో తిరిగి రావడం అని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో హత్యల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఒక సామాజిక సమస్యగా మారిందని తెలిపారు. ముఖ్యంగా టూ వీలర్ దారులు, పాదచారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు.హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, సరైన విధంగా స్ట్రాప్ వేసుకోవాలని సూచించారు. ఇద్దరు ప్రయాణించే వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. సీట్ బెల్ట్ ఉపయోగించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని, సీట్ బెల్ట్ ధరించినప్పుడే ఎయిర్‌బ్యాగ్‌లు పనిచేస్తాయని వివరించారు.మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, లెఫ్ట్ సైడ్ ఓవర్‌టేక్ వంటి చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు. హై బీమ్ లైట్లు సరైన విధంగా ఉపయోగించకపోవడం, అక్రమ పార్కింగ్ కూడా ప్రమాదాలను పెంచుతున్నాయని పేర్కొన్నారు.డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని, ముందున్న వాహనంతో సేఫ్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. పాదచారులను ‘కింగ్ ఆఫ్ ది రోడ్’గా గౌరవించాలని అన్నారు.విద్యార్థులు వాహనాల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని, తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని డీజీపీ సూచించారు.
