‘ధురంధర్’పై మరో వివాదం

May 22, 2026 3:47 PM
Director Aditya Dhar’s film Dhurandhar faces legal scrutiny in Delhi High Court.

సైనిక రహస్యాల ఉల్లంఘన ఆరోపణ

కేంద్రం, సెన్సార్‌ బోర్డుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

దర్శకుడు Aditya Dhar తెరకెక్కిస్తున్న Dhurandhar మరోసారి న్యాయ వివాదంలో చిక్కుకుంది. కొద్ది రోజుల క్రితం ఓ రచయిత ఈ సినిమాపై కాపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విధుల్లో ఉన్న సైనికుడు దీపక్‌ కుమార్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

సైనిక దళాల ఆపరేషన్లకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సినిమాలో చూపించారని, ఇది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన Delhi High Court.. ఈ సినిమా కల్పిత కథ ఆధారంగా, వినోదం కోసం రూపొందించిందని వ్యాఖ్యానించింది. అయితే సైనికుడు వ్యక్తం చేసిన ఆందోళనలను విస్మరించలేమని కూడా స్పష్టం చేసింది.

దీంతో ఈ అంశాన్ని గంభీరంగా పరిశీలించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు సెన్సార్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media