అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సుమతి రోడ్డు మీదకు వెళ్లగా

May 6, 2026 2:57 PM

హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై చర్యల్లో భాగంగా నగర మహిళా పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా ఫీల్డ్‌లోకి దిగారు. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అర్ధరాత్రి ఈ ఆపరేషన్ చేపట్టారు.

ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా సాధారణ మహిళలా దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌కు వెళ్లారు. బస్సు కోసం వేచిచూస్తున్నట్టుగా ఉంటూనే అక్కడి పరిస్థితులను గమనించారు. ఆమె పోలీస్ కమిషనర్ అని తెలియక కొందరు యువకులు, పోకిరీలు ఆమెను వేధించారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆమె అక్కడే ఉండి మహిళలు ఎదుర్కొనే పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతపై వరుస ఫిర్యాదులు రావడంతో కమిషనర్ సుమతి మూడు రోజుల పాటు స్వయంగా నిఘా పెట్టినట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media