జిల్లాలో ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడతోపాటు, తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని ఆదేశించారు… వన మహోత్సవం కింద రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకుగాను అన్ని గ్రామాలలో మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని, నర్సరీలలో పెంచుతున్న మొక్కల గురించి గ్రామసభలలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు… నల్లగొండ జిల్లా నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం మండలాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేసి ప్రభుత్వ పథకాల అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వల్లాల గ్రామంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న వనమహోత్సవం నర్సరీని తనిఖీ చేసి గ్రామానికి నిర్దేశించిన 13800 మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే గ్రామ చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఫిష్ పాండ్ తవ్వుతుండగా తనిఖీ చేసి నేరుగా కూలీలతో మాట్లాడి పాలు సూచనలు చేసారు.. ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడతోపాటు, తాగునీటిని కల్పించాలని డిఆర్డిఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు.
