Gunturలోని Gorantla Venkateswara Swamy Templeలో జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. కార్యక్రమంలో పూలు చల్లేందుకు ఏర్పాటు చేసిన డ్రోన్ ఒక్కసారిగా ధ్వజస్తంభాన్ని తాకి కూలిపోవడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
డ్రోన్ కూలిన ఘటనలో కొంతమందికి స్వల్ప గాయాలు అయినప్పటికీ, పెద్ద ప్రమాదం తప్పడంతో ఆలయ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది.భక్తుల భద్రత దృష్ట్యా ఇటువంటి కార్యక్రమాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.
