వైభవంగా దుర్గా మల్లేశ్వర్ల నదీ విహారం.

April 4, 2026 6:10 PM

ఇంద్రకీలాద్రి BNS ఏప్రిల్ 4.)) ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర ల చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షకులు,దుర్గ మల్లేశ్వరస్వామి వార్ల కృష్ణానది నదీ విహార ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుండి నేల తాళాలతో మహా మండపం ద్వారా కృష్ణా నది చెంతకు తీసుకువచ్చారు. కూచిపూడి నృత్యలు, సంప్రదాయ తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తన లతో కళాకారులు దుర్గా మల్లేశ్వర లకు స్వాగతం పలికారు.

పుష్పాలంకరణ చేసిన ఫంటు పై స్వామి, అమ్మవార్లను అధిరోహింపజేసి,ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవిత్ర కృష్టానదిలో నదీవిహారం ప్రారంభం కాగా కళ్యాణోత్సవ ఆది దంపతులను కృష్ణా నదిలో త్రిలోకములకు గుర్తుగా మూడుసార్లు ప్రదక్షిణ చేయించి విహరింపజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media