గచ్చిబౌలి పబ్‌లపై ఈగల్ టీం దాడులు – 8 మందికి డ్రగ్స్ పాజిటివ్

April 3, 2026 4:31 PM


గచ్చిబౌలి:(బిఎన్ఎస్ మీడియా):నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ వినియోగంపై కట్టడి చర్యల భాగంగా ఈగల్ టీం, పోలీసులతో కలిసి గచ్చిబౌలి పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కోండాపూర్‌లోని క్వాక్ అరినా పబ్‌లో ప్రత్యేకంగా దాడులు నిర్వహించి సందేహాస్పద వ్యక్తులను పరీక్షించారు.

ఈ తనిఖీల్లో మొత్తం 8 మందికి డ్రగ్స్ వినియోగం చేసినట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. పబ్ యాజమాన్యం పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.

ఇటీవల నగరంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. పబ్‌లు, నైట్‌క్లబ్‌లపై ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. యువత డ్రగ్స్ వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media