టీమిండియా యువ ఆల్ రౌండర్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు నితీశ్ కుమార్ కు స్థానం దక్కింది. అయితే నితీశ్ ఆటలో చాలా మార్పు వచ్చిందని, భవిష్యత్తులో భారత జట్టులో కీలక ఆటగాడిగా మారతాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆల్ రౌండర్లలో నితీశ్ కుమార్ రెడ్డి అత్యుత్తమమని కొనియాడారు. అతని ఆటలో కనిపిస్తున్న మెరుగుదల పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నామన్నారు. రాబోయే సిరీస్‌లలో అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించాం. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని నితీశ్ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా చూస్తామని హామీ ఇచ్చారు అజిత్ అగార్కర్.
విశాఖపట్టణానికి చెందిన నితీశ్, ఇప్పటివరకు 10 టెస్టులు ఆడి ఒక సెంచరీతో 396 పరుగులు చేసి, 8 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్, ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు.
