JUNE 26 నుంచి గోదావరి పుష్కరాలు: మంత్రి ఆనం

April 13, 2026 11:22 AM

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.

రాజమహేంద్రవరం లో రూ.9.55 కోట్ల వ్యయంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.పుష్కరాల నేపథ్యంలో ఆలయాల పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని 43 దేవాలయాల అభివృద్ధికి రూ.51.79 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున, గోదావరి నది 212 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.పుష్కరాలు రాష్ట్ర ప్రతిష్ఠకు సంబంధించినవని, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media