దేశంలో బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో కొద్దిరోజులు ధరల పెరుగుదల కనిపించినా, కొన్ని కారణాల వలన బంగారం ధరల్లో తీవ్రమైన ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. మూడు రోజుల లాభాల తర్వాత, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ధరలు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,480గా నమోదైంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,46,190 వద్ద ఉంది. చెన్నైలో అత్యధికంగా 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,230గా ఉండగా, ఢిల్లీలో రూ. 1,59,630గా ఉంది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.2,95,100 ఉండగా, ముంబై, ఢిల్లీ మార్కెట్లలో రూ.2,84,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

