అనకాపల్లి జిల్లాలోని ఎస్. రాయవరం మండలం గోగులపాడుకు చెందిన YSRCP నాయకుడు నూకనాయుడు ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి విశాఖపట్నంలోని సాయి గోదావరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు Golla Baburao ఆయనను ఆసుపత్రిలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్న ఎంపీ, నూకనాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
