విశాఖలో గూగుల్ మెగా data సెంటర్: టెక్ హబ్‌గా మారనున్న నగరం

April 28, 2026 10:48 AM

ఆంధ్రప్రదేశ్‌లోని Visakhapatnam నగరం త్వరలోనే next-level టెక్ హబ్‌గా మారబోతోంది. Google ఆధ్వర్యంలో భారీ AI డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు నేడు గ్రాండ్ ఫౌండేషన్ వేడుక నిర్వహించారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, మంత్రి Nara Lokesh ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ మూడు భారీ డేటా సెంటర్లను అభివృద్ధి చేయనుంది. విశాఖ జిల్లా తర్లువాడ, అడవివరం ప్రాంతాలు మరియు అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 1 గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో ఈ సెంటర్లు నిర్మించబడనున్నాయి.ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాల భూమిని కేటాయించింది. 2028 నాటికి ఈ మూడు డేటా సెంటర్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో గూగుల్ ముందుకెళ్తోంది.ఈ మెగా ప్రాజెక్ట్ అమలైతే, విశాఖ నగరం ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు పోటీగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media